
- 25 నుండి 27 వరకు ఈ-డిప్ నమోదుకు అవకాశం
- 29వ తేదిన టోకెన్లు కేటాయింపు
తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి 6,7,8వ తేదిల్లో రోజుకు 5వేల టోకెన్ల చొప్పున తిరుమల,తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల వారికి స్థానికుల కోటా కింద కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.ఈ నేపథ్యంలో ఈనెల 25వ తేది ఉదయం 10 నుండి 27 వ తేది సాయంత్రం 5 గంటల వరకు ఈ- డిప్ నమోదుకు టీటీడీ అవకాశం కల్పించనుంది.
తిరుమల, తిరుపతి, రేణిగుంట,చంద్రగిరికి చెందిన స్థానికులు పైన పేర్కొన్న తేదీల్లో 1+3 విధానంలో ఈ-డిప్ కోసం టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. 29న మధ్యాహ్నం 2 గంటలకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు కేటాయించడం జరుగుతుంది.ఇందులో రోజుకు తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు 4,500, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు చొప్పున కేటాయించనున్నారు.ఈ విషయాన్ని గమనించి స్థానికులు టోకెన్ల కోసం ఈ-డిప్ ద్వారా నమోదు చేసుకోవాలని టీటీడీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News