చికిత్స పొందుతూ గర్భిణీ స్త్రీ మృతి

గొలుగొండ,ఐఏషియ న్యూస్: గొలుగొండ మండలం ఎటిగైరంపేట గ్రామానికి చెందిన మాకిరెడ్డి లోవ (27) అనే ఏడు నెలల గర్భిణీ స్త్రీ వైద్యం పొందుతూ బుధవారం మృతి చెందింది. తుఫాన్‌ నేపథ్యంలో హై రిస్క్‌ గర్భిణీలను ముందస్తు జాగ్రత్త చర్యగా ఈనెల 25న నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించాలని వైధ్యఅధికారులు ఆదేశాలు జారీ చేశారు.దీననుసరించి వైద్య సిబ్బంది లోవను ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది.అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి, ఆమెను విశాఖ కేజీహెచ్‌ కు తరలించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అనంతరం ఆమెను విశాఖకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది ఈ ఘటనతో ఎటిగైరంపేట గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *