అత్తను సజీవదహనం చేసిన కోడలు

పెందుర్తి(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: అత్తను కుర్చీలో కాళ్లతో కట్టి కళ్లకు గంతలు కట్టి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన అమానవీయ సంఘటన విశాఖ జీవీఎం 98వ వార్డు పరిధిలోగల అప్పన్నపాలెంలోజరిగింది.ఈ సంఘటనపై శనివారం సాయంత్రం వెస్ట్ ఎసిపి పృథ్వీరాజ్, సీఐ కెవి సతీష్ కుమార్ తో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలియజేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.అప్పన్నపాలెంలోని జయంతి కనకమహాలక్ష్మి(66), కుమారుడు సుబ్రహ్మణ్య శర్మ, కోడలు లలిత, వారి పిల్లలతో వర్షిణి అపార్టమెంట్‌లో నివసిస్తున్నారు.శుక్రవారం ఉదయం సుబ్రహ్మణ్య శర్మ బయటకు వెళ్లగా అదే సమయంలో వారి ఇంట్లో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగగా ఆ మంటల్లో సజీవ దహనమైన అత్త కనకమహాలక్ష్మి.టీవీ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు పోలీసులకు తెలిపిన కోడలు లలిత.కనకమహాలక్ష్మి మృతదేహం కాలిపోయిన తీరుపై అనుమానించిన పోలీసులు ఇంట్లో పరిశీలించగా షార్ట్ సర్క్యూట్ కాలేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు.
తమదైన శైలిలో పోలీసులు కోడలు లలితను ప్రశ్నించగా తానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది.ఆమె మంటల్లో కాలిపోతున్నప్పుడు కేకలు వినిపించకూడదని పెద్ద సౌండ్ పెట్టి టీవీ చూసినట్లు, కాళ్లు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు తెలిపిన కోడలు.పెళ్లి అయిన నాటి నుంచి తను నిత్యం ఏదో రకంగా వేధిస్తున్న అత్తను మట్టుపెట్టాలని కోడలు లలిత పన్నాగం పన్నింది. తన అత్తను హతమార్చేందుకు కోడలు లలిత హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అనే యూట్యూబ్ వీడియోలు చూసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం లలిత గోసాల వద్ద ఉన్న పెట్రోల్ బంక్ నుంచి వాటర్ బాటిల్లో పెట్రోల్ కొనుగోలు చేసింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం తన కుమార్తె,అత్త కనకమహాలక్ష్మిలను లలిత దొంగ పోలీస్ ఆట ఆడాలని సూచించింది. దీంతో అత్తని కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టి కళ్ళకు చున్నీతో గంటలు కట్టింది లలిత.అప్పటికే తాను తెచ్చుకున్న పెట్రోలు అత్త లలితపై పోసింది. దీపం వెలిగించే వత్తి వెలిగించి అత్తపై వేసింది. మంటలు వ్యాపించి అత్త కనకమహాలక్ష్మి సజీవ దహనం అయింది. అత్త అరుపులు వినిపించకుండా ఉండేందుకు టీవీ వాల్యూం పెద్దదిగా పెట్టింది.ఇంతలో అపార్ట్మెంట్లో మంటలు రావటానికి గమనించిన చుట్టుపక్కల వాళ్ళు అపార్ట్మెంటుకు చేరుకోగానే టీవీ వైర్లు కాలి అత్త కాలిపోయిందని కోడలు లలిత నమ్మబలికింది. ఈ అకస్మాత్తుగా మంటలు చేలరేగడంతో లలిత కుమార్తె కూడా గాయపడింది. ఈ సంఘటనపై స్థానికులు పెందుర్తి పోలీసులు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతురాలు కనక మహాలక్ష్మి కుమారుడు సుబ్రహ్మణ్య శర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కనకమహాలక్ష్మి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. నిందితురాలు లలితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లో మాదకద్రవ్యాల వ్యాపారం మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ , చిక్కడపల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *