భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శ్రీశైలం పర్యటన

పూలమొక్కతో స్వాగతం పలికి జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్

శ్రీశైలం,ఐఏషియ న్యూస్: భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శుక్రవారం శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి వారి దర్శనార్థం శ్రీశైలాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా శ్రీశైలంలోని భ్రమరాంబ అతిథి గృహం వద్దకు రాగానే జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ పూల మొక్కతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి వారి దర్శనం చేసుకోవడం తనకు, తన కుటుంబానికి లభించిన గొప్ప అదృష్టమని తెలిపారు. పరమశివుని, అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. శ్రీశైల దేవస్థానంలో శివశక్తుల దర్శనం తనకు, తన కుటుంబానికి మరపురాని అనుభూతిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కూడా “అన్న క్యాంటీన్లు” ఏర్పాటు

గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *