ఆంధ్రప్రదేశ్ లో ఏఐ వైద్యులు అందుబాటులోకి తీసుకువస్తాం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్ బ్యూరో: సీఎం చంద్రబాబు శుక్రవారం విశాఖలో కీలక ప్రకటన చేశారు. విశాఖ కాపులుప్పాడ ఐటీ హిల్స్ వద్ద ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ క్యాంపస్ కు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కాగ్నిజెంట్ ప్రతినిధులు, ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘త్వరలోనే అందరి ఆరోగ్యానికి డిజిటల్ హెల్త్ రికార్డులతో పాటు ఏఐ డాక్టర్లను కూడా అందుబాటులోకి తెస్తామని, ఆరోగ్యపరంగా ఏం కావాలన్నా ఏఐ డాక్టర్లను అడిగి ముందుకు వెళ్లే పరిస్థితిని తీసుకొస్తామని పేర్కొన్నారు. వాళ్లే వైద్య పరీక్షలు ఆటోమేటిక్ గా చేసుకునే పరిస్థితి వస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇలా వైద్య ఆరోగ్య రంగంలో ఏఐలనుఉపయోగించుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం జరుగుతోందని తెలియజేశారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *