మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఆగేవరకు పోరాటం ఆగదు

గవర్నర్ ను కలిసి కోటి సంతకాల ప్రతులను అందజేసిన మాజీ సీఎం జగన్

విజయవాడ,ఐఏషియ న్యూస్: ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ప్రయివేటు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది. దీనిని వైసీపీ వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే ఈ నిర్ణయం పైన నిరసనలు నిర్వహించింది. కోటీ సంతకాలు సేకరించింది. వీటిని మాజీ సీఎం జగన్ గవర్నర్ కు గురువారం అందజేయడం జరిగింది. కాగా.. ఈ సందర్భంలో జగన్ కీలక హెచ్చరికలు చేసారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆగే వరకూ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణను నిరసిస్తూ వైసీపీ పోరాటం కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ రోజు కోటి సంతకాలతో గవర్నర్ ను కలవనున్న జగన్ ఈ కార్యక్రమానికి ముందు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యి దిశా నిర్దేశం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి భారీ ర్యాలీగా జగన్ లోక్ భవన్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూమెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. మెడికల్‌ కళాశాలలను ప్రైవేట్‌ పరం చేయనున్న కూటమి సర్కార్‌కు అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మెడికల్‌ కళాశాలల ప్రయివేటు నిర్వహణ బాధ్యత తీసుకునే వారిని రెండు నెలల్లో జైలుకు పంపుతామని హెచ్చరించారు.కాగా..మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం కోటి 4 లక్షల 11,136 మంది సంతకాల ప్రతులను లోక్‌భవన్‌లో గవర్నర్‌కు అబ్దుల్ నజీర్ కు అందజేశారు.పేద, మద్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే మెడికల్‌ కళాశాలలను ప్రైవేటుపరం చేయడం దారుణమని జగన్ పేర్కొన్నారు. ఉచిత వైద్యం అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ పెద్ద కుంబకోణమని, ఈ విషయంలో కోర్టులో అఫిడవిట్‌ వేస్తామని వెల్లడించారు. ప్రైవేట్‌ వారికి మెడికల్‌ కాలేజీలను అప్పగించి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తామని పేర్కొనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లు,ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, మాజీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేదించండి

కేంద్ర ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు సూచన చెన్నై,ఐఏషియ న్యూస్: సోషల్ మీడియా వినియోగం పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *