ఇండిగో సంక్షోభం.. దిల్లీలో రూ.1,000 కోట్లు నష్టం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఇండిగో సంక్షోభంతో దిల్లీలో వ్యాపార,పర్యాటక, పారిశ్రామిక రంగాలకు రూ.1,000 కోట్లు నష్టం వాటిల్లిందని ది ఛాంబర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ వెల్లడించింది. విమాన రాకపోకల్లో అంతరాయం వల్ల వ్యాపారులు, పర్యాటకులు, బిజినెస్‌ ట్రావెలర్స్‌ రాకపోకలకకు అంతరాయం కలిగిందని పేర్కొంది. గత 10 రోజుల్లో దిల్లీ మార్కెట్లలో జనసంచారం దాదాపు 25శాతం తగ్గిందని వివరించింది. దిల్లీ విమానాశ్రయం నుంచి నిత్యం 1.5 లక్షల ప్యాసింజర్లు ప్రయాణిస్తుంటారని అందులో సుమారు 50 వేల మంది వ్యాపారులు, బిజినెస్‌ ట్రావెలర్స్‌ ఉంటారని తెలిపింది.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

తాజ్ మహల్ సందర్శించిన జూనియర్ ట్రంప్

తాజ్ మహల్ ఎంతో గ్రాండ్ గా..అందంగా: జూనియర్ ట్రంప్ కితాబు ఆగ్రా,ఐఏషియ న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *