ఉప్పల్‌లో ఫుట్‌బాల్‌ సంబరం..మెస్సీ–సీఎం రేవంత్‌ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్

హైదరాబాద్‌,ఐఏషియ న్యూస్: నగరంలోని ఉప్పల్‌ స్టేడియం శనివారం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఉత్సవానికి వేదికగా మారనుంది. రాత్రి 7 గంటలకు ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ జట్టు – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జట్టు మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు.
భారత్‌ పర్యటనలో భాగంగా మెస్సీ హైదరాబాద్‌కు రావడం ఫుట్‌బాల్‌ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో తనదైన ముద్ర వేసిన మెస్సీని ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించడంతో స్టేడియం పరిసరాల్లో ప్రత్యేక సందడి నెలకొంది.ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ను వీక్షించేందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా ఉప్పల్‌ స్టేడియానికి రానున్నారు. రాజకీయ, క్రీడా ప్రముఖుల సమక్షంలో జరగనున్న ఈ మ్యాచ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు స్టేడియంలో ప్రత్యేక భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు.నేటి ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌ కేవలం క్రీడా పోటీకే కాకుండా, హైదరాబాద్‌ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే ఘట్టంగా నిలవనుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *