మహిళా వరల్డ్ కప్ క్రికెటర్లతో ప్రధాని మోడీ భేటీ

 

 

 

 

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు బుధవారం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ఆయన నివాసానికి మహిళల ప్రపంచ కప్ ఆడిన క్రికెటర్లతో భేటీ అయ్యారు. వరల్డ్ కప్ టైటిల్ విజయంపై ప్రధాని మోడీ క్రికెటర్లను అభినందించారు.అదే సమయంలో వరుసగా మూడు పరాజయాలు, సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్ తర్వాత టోర్నమెంట్‌లో వారి అద్భుతమైన పునరాగమనాన్ని ప్రశంసించారు. దీంతో క్రికెటర్లు కూడా తాము ఎదుర్కొన్న పరిస్ధితుల్ని ప్రధానితో పంచుకున్నారు.మరోవైపు మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2017లో ప్రధానమంత్రిని కలిసిన విషయాన్ని గుర్తుచేసుకుంది. ఆ సమయంలో తాము ట్రోఫీ లేకుండానే కలిసినట్లు గుర్తుచేసుకుంది. ఇప్పుడు తాము ట్రోఫీతో ప్రధాని మోడీని కలిసినందుకు సంతోషంగా ఉందన్నారు. కాబట్టి తాము తరచుగాప్రధానినికలవాలనికోరుకుంటున్నట్లు వెల్లడించారు. అప్పట్లో ప్రధాని మోడీ తమకు స్పూర్తినిచ్చేలా మాట్లాడారని ఓపెనర్ స్మృతీ మంథాన గుర్తుచేసుకున్నారు.దీప్తిశర్మను చూసిన ప్రధాని మోడీ..ఆమె చేతిపై హనుమంతుడి పచ్చబొట్టు గురించి అడిగారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్ బయోలో “జై శ్రీ రామ్” అని రాసిన దాని గురించి చర్చించారు. అది తనకు బలాన్ని ఇస్తుందని దీప్తి తెలిపింది. ప్రపంచ కప్ విజేత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ప్రధాని మోదీని మీరు ఎల్లప్పుడూవర్తమానంలోఎలాఉండగలుగుతున్నారని అడిగారు.దీనికి ప్రధాని మోదీ ఇప్పుడు అది తనకు అలవాటుగా మారిందన్నారు. ప్రపంచ కప్ ఫైనల్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన క్యాచ్‌తో ముగించడంపై ప్రధాని స్పందిస్తూ ఆ క్యాచ్ పట్టిన వెంటనే, భారత కెప్టెన్ బంతిని తన జేబులో పెట్టుకుందని, బంతి తన వద్దకు రావడం తన అదృష్టమని,ఆమె దానిని తనవద్దేఉంచుకుందన్నారు.
అలాగే అమన్‌జోత్ కౌర్ దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ క్యాచ్‌ను డీప్ మిడ్-వికెట్‌లో తడబడి పట్టుకోవడంపై ప్రధాని స్పందిస్తూ ఆ క్యాచ్ దాదాపుగా భారత్‌కు ఆటను ఖరారు చేసిందన్నారు.క్యాచ్ పట్టుకునేటప్పుడు మీరు బంతిని చూడాలి, కానీ క్యాచ్ తర్వాత మీరు ట్రోఫీని చూడాలన్నారు. పేసర్ క్రాంతి గౌడ్ తన సోదరుడు ప్రధాని నరేంద్ర మోడీకి పెద్ద అభిమాని అని తెలిపింది. దీంతో ప్రధాని వెంటనే వారిని కలవమని ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా ఉన్న బాలికలకు ఫిట్ ఇండియా సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన క్రికెటర్లను కోరారు. వారి పాఠశాలలను సందర్శించి అక్కడి యువతుల్ని ప్రేరేపించాలని సూచించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ప్రభుత్వ పాలనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర

ఈ ఏడాది రాజకీయంగా ఎన్నో ఘన విజయాలు ఉద్యోగులు,ప్రజల మన్ననలు పొందిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ను ఆరాధ్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *