హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఓ వివాహిత క్షణికావేశంలో తన రెండేళ్ల కుమార్తెతో కలిసి హుస్సేన్‌సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది.కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత తన రెండేళ్ల కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. పాతబస్తీకి చెందిన పృథ్విలాల్ వ్యాపారం చేస్తుండగా ఆయన భార్య కీర్తిక అగర్వాల్ (28) చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. వీరికి బియ్యారా అనే రెండేళ్ల కుమార్తె ఉంది. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో.. కీర్తిక గత ఏడాదిన్నరగా తన కుమార్తెతో కలిసి బహదూర్‌పురలో ఉన్న తన తల్లిదండ్రుల వద్దే నివాసం ఉంటున్నారు. అయితే జీవితంలో ఎదురైన ఆటుపోట్లను తట్టుకోలేక.. కీర్తిక అగర్వాల్ ఈ నెల 2వతేదీన హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.సోమవారం నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ సమీపంలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.హుస్సేన్‌సాగర్ లేక్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో వివరాలు లభ్యం కాకపోవడంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News