హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో భారీ మార్పులు జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయని, కొందరు మంత్రులు పదవులు కోల్పోతారని సమాచారం. కొత్తగా ముగ్గురికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ పదవులు కోల్పోతారని ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. ఈనెల 11 తర్వాత మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి పదవి కోసం పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు ఎదురుచూస్తున్నారు.తాజాగా ఎమ్మెల్సీ అజారుద్దీన్ కి మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా నియమితులైన సంగతి తెలిసిందే.మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయో వేచి చూడాలి.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News