శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం నజరానా…రూ.2.5 కోట్ల నగదు పురస్కారం

  • గ్రూప్ వన్ ఉద్యోగం కడపలో ఇంటి స్థలం మంజూరు
  • సీఎం చంద్రబాబును కలిసిన మహిళా క్రికెటర్ శ్రీచరణి

విజయవాడ,చాన్విక జ్యోతిన్యూస్: భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్.. క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. వీరికి మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. ప్రపంచకప్ గెలిచినందుకు శ్రీచరణిని చంద్రబాబు, నారా లోకేశ్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను శ్రీచరణి వారితో పంచుకున్నారు. ప్రపంచకప్ గెలుచుకోవడం ద్వారా టీన్ఇండియా జట్టు సత్తా చాటిందని.. మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం కొనియాడారు.
ఇది మొదటి అడుగు మాత్రమే: శ్రీచరణి
క్రికెటర్ శ్రీచరణి ఇవాళ ఉదయం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. “అందరి అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కుటుంబం నుంచి నాకు చక్కటి ప్రోత్సాహం ఉంది. మా మామ నన్ను క్రికెట్ ఆడించేవారు. నేను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో శిక్షణ పొందాను. ఇది మొదటి అడుగు మాత్రమే.. ముందు చాలాఉంది. ప్రధాని మోదీని కలిసినప్పుడు భవిష్యత్ కార్యాచరణపై సలహాలిచ్చారన్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *