అనంత్ నాగ్ లో పక్షి ఢీకొనడంతో లోకో పైలట్ కు గాయాలు: ప్రయాణికులందరూ సురక్షితం

అనంత్ నాగ్,ఐఏషియ న్యూస్: బిజ్బెహారా-అనంత్ నాగ్ మధ్య శనివారం ఉదయం లోకోమోటివ్ అద్దంను డేగ ఢీకొనడంతో రైలు పైలట్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.గాయపడిన పైలట్ శ్రీ విశాల్ కు అనంత్ నాగ్ రైల్వే స్టేషన్లో ప్రథమ చికిత్స అందించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.తనిఖీ కోసం రైలును కొద్దిసేపు నిలిపివేసి, తర్వాత రైలు ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి రైల్వే అధికారులు అనుమతి ఇచ్చారు.ఈ ప్రమాదంలో ప్రయాణికులకి ఎటువంటి నష్టం జరగలేదని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లో మాదకద్రవ్యాల వ్యాపారం మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ , చిక్కడపల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *