తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణను రాజకీయ నేతల్ని ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా వాలిపోయిన కొబ్బరి చెట్లను చూసి తెలంగాణ నేతల దిష్టి తగిలిదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై తెలంగాణ మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. పవన్ వ్యాఖ్యల్ను తప్పుబడుతూ ఇవాళ వరుస వార్నింగ్ లు ఇస్తున్నారు.తాజాగా గోదావరి జిల్లాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ వాలిపోయిన కొబ్బరిచెట్లను చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నరుడి దిష్టి నలభయ్యేళ్లని, రోళ్లు కూడా పగిలిపోతాయంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ వాళ్ల దిష్టి తగిలే ఇలా జరిగిందంటూ ఆరోపించారు. అప్పట్లో గోదావరి జిల్లాల పచ్చదనం చూసి తెలంగాణ నేతలు రాష్ట్ర విభజనకు డిమాండ్ చేశారని వెల్లడించారు. దీనిపై తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగుతోంది. ఇదే క్రమంలో ఇవాళ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి పవన్ పై తీవ్రంగా మండిపడ్డారు.పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా ఆయన సినిమాలు ఒక్క థియేటర్లో కూడా రిలీజ్ కానివ్వబోనని తీవ్ర హెచ్చరిక చేశారు. కోనసీమ కొబ్బరిచెట్లకు తెలంగాణ నేతల దిష్టితగల్లేదని,ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యంవల్లేతెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషపు నీటిని తాగారన్నారు. దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజల వెనుకబాటుకు కారణమైన ఆంధ్రపాలకుల్ని ప్రశ్నించకుండా తమపై నిందలు వేస్తారా అని కోమటిరెడ్డి నిలదీశారు. అలాగే పవన్ కళ్యాణ్ కు తగిన పాలన అనుభవం లేకపోవడం వల్లే ఇలాంటి అపరిపక్వ వ్యాఖ్యలు చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని మంత్రి కోమటిరెడ్డి ఆయనకు సూచించారు.
తెలంగాణ మంత్రుల వ్యాఖ్యల పై స్పందించిన జనసేన
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమలో చేసిన వ్యాఖ్యల్ని కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని కావాలని వక్రీకరించవద్దని జనసేన పార్టీ కీలక అప్పీలు చేసింది.
రాజోలు నియోజకవర్గం లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలు వక్రీకరిస్తున్నారని పేర్కొన్న జనసేన పార్టీ పవన్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు పుట్టినరోజు ఆశీస్సులు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఉదయం సోషల్ మీడియాలో ఆశీస్సులు.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *