విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐ.డి.ఎఫ్.సి ఫస్ట్ బ్యాంక్ సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో మూడోవన్డే తలపడేందుకు విశాఖ విచ్చేసిన ఇండియా క్రికెట్ టీమ్ కు ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ బాబు స్వాగతం పలికారు. అనంతరం సీనియర్ ప్లేయర్స్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, కోచ్ గౌతమ్ గంభీర్ లకు ఏసీఏ తరుఫున జ్ఞాపికలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సి.వో.వో గిరీష్ డోంగ్రీ, ఏసీఏ స్టేడియం చైర్మన్ ప్రశాంత్, ఏసీఏ వైస్ ప్రెసిడెంట్ బండారు నరసింహారావు, కోశాధికారి దండమూడి శ్రీనివాసరావు, ఏసీఏ కౌన్సిలర్ విష్ణు దంతు, బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్‌లో భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) ప్రతినిధి చాముండేశ్వరినాథ్ లతో పాటు ఏసీఏ సిబ్బంది పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News