విద్యుత్ శాఖకు తెలంగాణ “గీతం యూనివర్సిటీ” 118 కోట్లు బకాయిలు

  • విద్యుత్ బిల్లు బకాయిలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
  • విద్యుత్ శాఖ ఎస్ ఈ కోర్టుకు స్వయంగా హాజరు కావాలని ఆదేశం

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణలోని గీతం యూనివర్సిటీ.. ఏళ్ల తరబడి కరెంట్ బిల్లు చెల్లించలేదంటూ టీజీఎస్పీ డీసీఎల్ ఆ యూనివర్సిటీకి ఇటీవల నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసులపై ఆ వర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. సదరు యూనివర్సిటీ 2008 నుంచి రూ. 118 కోట్లు బిల్లులు కట్టకపోవడంతో జస్టిస్ నగేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సామాన్యులు రూ.1,000 కట్టకపోతే అధికారులు విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తున్నారని.. గీతం వర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకని ప్రశ్నించారు. ఈ మేరకు విద్యుత్ శాఖ ఎస్ ఈ హాజరుకావాలని ఆదేశించారు.తెలంగాణలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ విద్యుత్ బకాయిల విషయంలో తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. సామాన్యులకు రూ. 1,000 ఉంటేనే అధికారులు విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తున్నారని అలాంటిది.గీతం యూనివర్సిటీ రూ.వంద కోట్లకుపైగా బకాయిలు ఉంటే ఎలా చూసీ చూడకుండా ఉన్నారని జస్టిస్ నగేష్ భీమపాక ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్యుత్ బిల్లు చెల్లింపులో గీతం యూనివర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకని ప్రశ్నించారు.ఈ అంశంపైపూర్తివివరాలుసమర్పించాలని.సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌(ఎస్ ఈ) వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ దారులకు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అమలు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. బ్యాంకులు అందించే సేవల విషయంలో అందరికీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *