జోజినగర్ ఇళ్ల కూల్చివేతపై సిబిఐ విచారణ చేపట్టాలి

  • 42 మంది బాధితులకు కొత్త ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి
  • బాధితుల బ్యాంకు రుణాలు ప్రభుత్వమే చెల్లించాలి
  • జోజినగర్ బాధితులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో విజయవాడ భవానీపురంలో ఉన్న జోజినగర్ లో తాజాగా 42 ఇళ్ల కూల్చివేత వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కోర్టు ఆదేశాలను సాకుగా చూపుతూ తాజాగా అక్కడ ఉన్న ఇళ్లను స్ధానిక అధికారులు కూల్చేయడం రాజకీయ రంగు పులుముకుంది. దీంతో ఆయా బాధితులు విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఆశ్రయించారు. దీంతో ఆయన మంగళవారం భవానీపురం వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇళ్ల కూల్చివేతపై సిబిఐ విచారణ చేపట్టాలి
జోజినగర్ లో ఇళ్ల కూల్చివేతపై సీబీఐ విచారణ చేయించాలని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ ఇళ్ల కూల్చివేతకు సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, స్థానిక ఎంపీ కేశినేని చిన్ని, స్థానిక కార్పొరేటర్‌ సోదరుడే కారణమని ఆరోపించారు. కాబట్టి సీబీఐ విచారణతో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని జగన్ తెలిపారు. అలాగే జోజినగర్‌ బాధితుల బ్యాంక్‌ రుణాలు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఆ 42 కుటుంబాలకు తిరిగి ఇళ్లన్నీ కట్టించి ఇవ్వాలన్నారు.
జోజినగర్‌ బాధితులకు పూర్తి అండగా నిలబడతాం
పేదలకు ఏ ప్రభుత్వమైనా అండగా నిలబడాలని జగన్ తెలిపారు. కానీ, ఇక్కడ ప్రభుత్వమే వారికి వ్యతిరేకంగా పిటిషన్లు వేస్తోందన్నారు. జోజినగర్‌ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని, లేని పక్షంలో తమ ప్రభుత్వం రాగానే విచారణ తథ్యమని జగన్ హెచ్చరించారు.ఈ ఘటనకు బాధ్యులను బోనులో నిలబెట్టి తీరుతామన్నారు.జోజినగర్‌ బాధితులకు పూర్తి అండగా నిలబడతామని,వారి న్యాయ పోరాటానికి పార్టీ తోడుగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
టిడిపి నాయకుల లిటిగేషన్లు వల్లే ఇటువంటి సమస్యలు
ఇక్కడే కాదు. రాష్ట్రమంతా ఇదే కొనసాగుతోందని, అనేకచోట్ల ఎక్కడైనా చిన్న చిన్న లిటిగేషన్లు ఉంటే, టీడీపీ నాయకులు ఎంటర్‌ అవుతున్నారని, భూమి కబ్జా చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇంకా కొన్ని చోట్ల వారే స్వయంగాలిటిగేషన్లుపెట్టి,కబ్జాచేస్తున్నారని విమర్శించారు. అందుకే ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐ దర్యాప్తు జరిపించాలన్నారు.మరోవైపు జోజి నగర్ బాధితులకు మద్దతుగా జగన్ చేసిన వ్యాఖ్యలు, సీబీఐ విచారణ డిమాండ్ పై సీఎం చంద్రబాబు స్పందించారు.మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూజగన్,అక్కడికివెళ్లిచేసేదిఏముందన్నారు. ఈ వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉన్న విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

సుప్రీంకోర్ట్ అదనపు సొలిసిటర్ రా జనరల్ గా కనకమేడల రవీంద్ర కుమార్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు కీలక పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వం కనకమేడల రవీంద్రకుమార్ ‌కు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *