భారత్ అమెరికాల మధ్య కీలక 10ఏళ్ల రక్షణ ఒప్పందం

న్యూయార్క్,ఐఏషియ న్యూస్: ఒకవైపు భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ భారత్‌కు ఓభారీఊరటలభించింది.భారత్-అమెరికాల మధ్య వ్యూహాత్మక, భద్రతా సహకారం సరికొత్త శిఖరాలను చేరుకునేలా కీలక డీల్ కుదిరింది. మలేసియాలో జరిగిన ఒక కీలక సమావేశంలో రెండు దేశాల మధ్య కొత్త 10 ఏళ్ల రక్షణ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. మలేసియా ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే రెండు దేశాల మధ్య రక్షణ ఫ్రేమ్‌వర్క్‌పై సంతకాలు చేశారు.కీలక డీల్‌పై సంతకం చేసిన తర్వాత.. పీట్ హెగ్సెత్ ఎక్స్ వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి 10 ఏళ్ల అమెరికా-భారత్ రక్షణ ఫ్రేమ్‌వర్క్‌పై సంతకం చేసినట్లు తెలిపారు.ఇది తమ రక్షణభాగస్వామ్యాన్ని, ప్రాంతీయ స్థిరత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని.. తాము సమన్వయం, సమాచార మార్పిడి, టెక్నాలజీ సహకారాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని పేర్కొ్న్నారు. భారత్, అమెరికా మధ్య ప్రస్తుతం రక్షణ సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని వెల్లడించారు.
ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రాంతీయ భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నారు. మేక్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా భారత్‌లో రక్షణ తయారీని మరింత పెంచడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ ఫ్రేమ్‌వర్క్‌కు ఫిబ్రవరిలో డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన సమావేశంలో ఈ రక్షణ ఒప్పందానికి బీజం పడింది.ఈఒప్పందం సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్, హెగ్సెత్ తమ చర్చల్లో పలు కీలక అంశాలపై దృష్టి సారించారు. అమెరికా నుంచి భారత్‌కు రావాల్సిన ప్రధాన రక్షణ వస్తువుల విక్రయాలపై వేగవంతమైన నిర్ణయం తీసుకోవాలని చర్చించారు. తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు కీలకమైన జీఈ ఏరోస్పేస్ ఎఫ్ 404 ఇంజిన్ల డెలివరీలో జరుగుతున్న జరుగుతున్న ఆలస్యాన్ని పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ ఆలస్యం కారణంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డెలివరీ షెడ్యూళ్లకు ఆటంకం కలుగుతోందని తెలిపారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

పోరాడేవారంటే పాలకులకు భయం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: సమానత్వం కోసం పోరాడుతున్న వారంటే పాలకవర్గాలు భయపడుతున్నాయని ప్రముఖ బహుభాషా సినీనటి రోహిణి పేర్కొన్నారు. సిఐటియు జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *