స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: కవలలు ఇద్దరూ సైంటిస్ట్ లు కావడం,ఇద్దరూ డాక్టర్లు కావడం లాంటి అద్భుతాలు ఎక్కువగా సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. కానీ నిజజీవితంలో కూడా అలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి. కవలలు ఇద్దరూ ఐపీఎస్ అధికారులు అయిన అద్భుతం ఇది.
అరవిందన్ అనే ఐపీఎస్ అధికారి తన కవల సోదరుడు అభినందన్ తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అదికాస్తా నెటిజన్లని ఆశ్చర్యపరుస్తూ వైరల్ గా మారింది. ఇద్దరూ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్నారు. ఇద్దరూ ఖాఖీ డ్రెస్సులో అదిరిపోయేలా ఫోజు ఇచ్చారు. తమిళనాడు పోలీస్ ఢిల్లీ ఫోలీస్ ని కలిసిన వేళ తన కవల సోదరుడు అభినందన్ తో అంటూ అరవిందన్ పోస్ట్ చేశాడు. దీనితో నెటిజన్లు ఈ పోస్ట్ ని తెగ వైరల్ చేస్తున్నారు.ఇద్దరినీ సూర్య సింగం చిత్రంతో పోల్చుతూ కామెంట్స్ పెడుతున్నారు.మరికొంతమంది నెటిజన్లు వీరిద్దరూ ఒకరికొకరు డూప్ లాగా కనిపిస్తున్నారు. గుర్తు పట్టడం కష్టం అని కామెంట్స్ చేస్తున్నారు.అరవిందన్ తమిళనాడులో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నారు.అరవిందన్ తన కార్యాలయంలో ఎస్ఎంఎస్ అలెర్ట్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తన విధుల్లో పరిచయం చేశారు.సైబర్ ఫ్రాడ్ లు జరగకుండా అరవిందన్ ఎంతో చైతన్యం తీసుకువచ్చారు. ఇక తన సోదరుడు అభినందన్ ఢిల్లీలో ఎసిపి గా విధులు నిర్వహిస్తున్నారు. ఫైనాన్స్ మినిస్ట్రీ లాంటి శాఖలో అభినందన్ పనిచేశారు.ఎంతో నిజాయితీగా సేవలు అందిస్తున్న ఈ కవల ఐపీఎస్ అధికారులకు మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేద్దాం.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News