జిల్లాల పునర్విభజనపై మంత్రుల బృందం కసరత్తు

  • 29, 30 తేదీల్లో 13 జిల్లాల్లో మంత్రుల బృందం పర్యటనకు ముహూర్తం ఖరారు
  • సెప్టెంబర్ 15 నాటికి ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనున్న మంత్రుల బృందం
  • డిసెంబర్ 31 లోపు జిల్లాల పేర్లు సరిహద్దుల మార్పుల ప్రక్రియ పూర్తి

(వడ్డాది ఉదయకుమార్)
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో జిల్లాల పునర్విభజనపై మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే ప్రభుత్వం జిల్లాల పునర్విభజన కోసం నియమించిన మంత్రుల బృందం బుధవారం అమరావతి సచివాలయంలో సమావేశమైంది. ఇందులో మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు,నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈరోజు సచివాలయంలో తొలిసారి భేటీ అయిన జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై నియమించిన మంత్రుల బృందం.పలుఅంశాలపైచర్చించింది.అనంతరంజిల్లాలు,మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై సెప్టెంబర్ 15వ తేదీ నాటికి ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.ఆలోపు చేపట్టాల్సిన కసరత్తుకు షెడ్యూల్ ఫిక్స్ చేశారు.ఈ నెల 29, 30 తేదీల్లో ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో పర్యటించి ప్రజా ప్రతినిధులు, ప్రజల నుండి వినతులు స్వీకరించాలని మంత్రులు నిర్ణయించారు. ఈలోపు కూడా ప్రజలు తమ వినతులను జిల్లాకలెక్టర్, కు పంపించవచ్చన్నారు. సెప్టెంబర్ రెండో తేదీ వరకు మాత్రమే ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి వినతులు స్వీకరిస్తారని వారు తెలిపారు.గత ప్రభుత్వం గందరగోళంగా చేసిన జిల్లాల పునర్విభజనను సరిచేసేందుకే మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. డిసెంబర్ 31లోపు జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులు ప్రక్రియ ముగిస్తామని మంత్రి సత్యప్రసాద్ వెల్లడించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా మార్పులు కోసం కసరత్తు చేస్తామని తెలిపారు. రెవెన్యూ గ్రామాలు, మండలాలు, డివిజన్లు, జిల్లాలకు సంబంధించిన మార్పులపైన మంత్రుల బృందం పని చేస్తుందని వెల్లడించారు. నియోజకవర్గాల జోలికి మాత్రం వెళ్లబోమన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని కూడా తాము పరిశీలిస్తామని, అయితే పరిపాలనా సౌలభ్యమే గీటురాయని తెలిపారు.కొత్తగా ఆరు జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం
ఇక, రాష్ట్రంలో 6 కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. ప్రతిపాదిత కొత్త జిల్లాలుగా పలాస, అమరావతి, మార్కాపురం,గూడూరు, మదనపల్లె, రాజంపేట మారనున్నట్లు తెలిసింది. ఇందులో ఒకట్రెండు స్థానాల్లో మార్పులు, చేర్పులు ఉండొచ్చు. దీనిపై మంత్రుల బృందం13 జిల్లాల్లో పర్యటించి తుది నివేదిక ప్రభుత్వానికి అందించనున్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

సుప్రీంకోర్ట్ అదనపు సొలిసిటర్ రా జనరల్ గా కనకమేడల రవీంద్ర కుమార్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు కీలక పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వం కనకమేడల రవీంద్రకుమార్ ‌కు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *