ఏపీకి 8 మంది ఐఏఎస్ అధికారుల కేటాయింపు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: కేంద్ర ప్రభుత్వం 2024 బ్యాచ్ కు ఎంపికయిన 179 మంది ఐఏఎస్ అధికారుల్లో 8 మందిని ఆంధ్రప్రదేశ్ కి కేటాయించింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ లేఖ రాసింది. రాష్ట్రకేడర్ కు కేటాయించినవారిలో బన్నా వెంకటేష్, ఏఆర్ పవన్ తేజ (ఆంధ్రప్రదేశ్), కె.ఆదిత్యశర్మ, చింతకింది శ్రవణ్ కుమార్ రెడ్డి (తెలంగాణ), హరిఓం పాండియా (రాజస్థాన్), నమ్రతా అగర్వాల్ (హరియాణా), ప్రియ (దిల్లీ), సుయష్ కుమార్ (ఉత్త రప్రదేశ్)లు ఉన్నారు.ఏపీ స్వరాష్ట్రంగా ఉన్న చెన్నంరెడ్డి శివ గణేష్ రెడ్డిని ఏజీఎంయూటీ, పి.సురేష్ ను తెలంగాణ కేడర్ కు కేటాయించారు. వీరంతా ఐఏఎస్ అధికారులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి రిపోర్ట్ చేసి బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *