ఏపీకి తుఫాన్ నష్టం 5 వేల కోట్లకు పైగా..

చంద్రబాబు శాఖల వారీ గా ప్రకటన

అమరావతి ,ఐఏషియ న్యూస్: ఏపీకి మొంథా తుఫాను భారీ నష్టం మిగిల్చింది. తుఫాను తీరం దాటే సమయంలో తీర ప్రాంతాన్ని వణికించింది. ముందస్తు చర్యలు చేపట్టటంతో ప్రాణ నష్టం తప్పినా.. ప్రభుత్వానికి మాత్రం భారీగా నష్టం వాటిల్లింది. అధికారులు ప్రభుత్వానికి తుఫాను నష్టం పైన ప్రాధమిక నివేదిక అందించారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వనుంది. కేంద్రం నుంచి సాయం అందుతుందని ఆశిస్తోంది. శాఖల వారీగా జరిగిన నష్టాన్ని అంచనా వేసారు.తుఫాను కారణంగా జరిగిన నష్టం పైన ప్రభుత్వం ప్రాధమికంగా ఒక అంచనాకు వచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు తుఫాను నష్ట వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో విపత్తుల శాఖ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చారని చెప్పుకొచ్చారు. మొత్తం మీద 5265.51 కోట్ల 5 నష్టం వచ్చినట్లు ప్రాథమిక అంచనాగా చెప్పారు. అందులో ప్రధానంగా వ్యవసాయంలో 829కోట్ల మేర నష్టం జరిగింది. హార్టికల్చర్ లో 39.99 కోట్లు, సేరికల్చర్ లో 65 లక్షలు నష్టం వాటిల్లిందని వివరించారు. పశుసంవర్థకశాఖ లో 75లక్షలు నష్టం వాటిల్లింది. ఈ తుఫాన్ కి ఇద్దరు చనిపోయి నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పడవ కొట్టుకుపోతుందని ఆందోళనతో వెళ్లి కొట్టుకుపోయారని చెప్పారు. ఇంకొకరు కాలకృత్యాలకి వెళ్లి చనిపోయాని వివరించారు.
ఇక మత్స్య శాఖలో 1,270 కోట్ల నష్టం వాటిల్లగా.. మున్సిపల్ శాఖలో 109కోట్లు నష్టం వాటిల్లింది. హౌసింగ్ లో 5. 53 కోట్లు నష్టం, ఆర్ అండ్ బి కి ఎక్కువ నష్టం వాటిల్లింది. ఆర్ అండ్ బి కి రూ. 2,080 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు వివరించారు. జలవనరుల శాఖ కు 207 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాధమికంగా తేల్చారు. రూరల్ వాటర్ సప్లై కి 1.26 కోట్ల నష్టం, పంచాయతి రాజ్ శాఖలో 8.70 కోట్ల నష్టం వచ్చింది అధికారులు ప్రాధమిక నివేదికలో వెల్లడించారు. తుఫాను సమయంలో సీఎస్ నుంచి మొదలుకుని గ్రామస్థాయి ఉద్యోగి వరకూ అందరూ రాత్రింబవళ్లుపనిచేశారనిచంద్రబాబుఅభినందించారు. టెక్నాలజీతో అన్ని శాఖలను అనుసంధానం చేస్తున్నాం.ప్రజలకుమంచిపరిపాలనఅందిస్తున్నామని చెప్పారు. వర్షాలు, తుఫాన్లు ఆపలేం.కానీ ప్రాణనష్టం తగ్గించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేసారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

కొత్త డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్: ఒక్కో సంఘానికి 15 వేలు

అమరావతి,ఐఏషియ న్యూస్: నూతనంగా ఏర్పాటయిన డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రూ.3 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *