ఉన్నత చదువుల కోసం వెళ్లి అనంత లోకాలకు

బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం: ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

అలబామా(అమెరికా),ఐఏషియ న్యూస్ ప్రతినిధి: అమెరికా బర్మింగ్‌హామ్ లోని అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో నివసిస్తున్న పది మంది తెలుగు విద్యార్థులు. హఠాత్తుగా చెలరేగిన మంటలతో ఉక్కిరిబిక్కిరైన విద్యార్థులు.అపార్ట్‌మెంట్‌లో ఫైర్ ప్రారంభమై కాసేపటిలోనే ఘాటైన పొగ రావడంతో విద్యార్థులు శ్వాస తీసుకోలేక భయంతో అరుపులు, కేకలు వేశారు.లోపల చిక్కుకుపోయిన 13 మంది విద్యార్థులను బయటకు తీసుకొని వచ్చిన అగ్నిమాపక సిబ్బంది.ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్ చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు.మృతి చెందిన వారిలో చెందిన ఉడుముల సహజ రెడ్డి, కూకట్ పల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నారు.అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులుగా వీరిని గుర్తింపు. ఉన్నత చదువులు కోసం అమెరికా వెళ్లి అర్ధాంతరంగా ఉత్సవాలు పడ్డ తెలుగు విద్యార్థుల కుటుంబ సభ్యుల కుటుంబాలలో విషాదఛాయలు అలముకున్నాయి.మృతి చెందిన విద్యార్థుల మృదేహాలను భారతదేశం తీసుకు వచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

అమెరికలో అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్

వాషింగ్టన్,ఐఏషియ న్యూస్: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వారి స్వదేశాలకు పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *