2 కోట్ల ఆధార్ నంబర్లను డిఆక్టివేట్ చేసిన యూఐడీఏఐ

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: భారతీయులకు ఆధార్ తప్పనిసరి. అయితే ఇటీవలి కాలంలో నకిలీ ఆధార్ కార్డులతో పథకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. అయితే ఇలాంటి వాటిని తగ్గించి ఆధార్ డేటాబేస్ పారదర్శకతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులను కేంద్ర ప్రభుత్వం డీయాక్టివేట్ చేసింది. దాదాపు 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను యూఐడీఏఐ తొలగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది.
ప్రస్తుతం సైబర్ నేరాలువిపరీతంగాపెరిగిపోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా ఈ క్రైమ్స్ మాత్రం ఆగడం లేదు.ఇటీవలికాలంలో విపరీతంగా వాడుకలోకి వచ్చిన ఏఐ ను కూడా వినియోగించి నకిలీ ఆధార్,పాన్ కార్డులను సైతం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో ఆధార్ లో కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చింది. ప్రజలు సులభంగా వినియోగించేలా మరికొన్ని మార్పులను ప్రవేశపెట్టనుంది భారత విశిష్ట యూఐడీఏఐ కొత్తగా యాప్అలాగే ఫేసియల్అథెంటికేషన్ ను తీసుకురానుంది.అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరణించిన వ్యక్తులకు చెందిన 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను డియాక్టివేట్ చేసినట్లు యూఐడీఏఐ తెలిపింది. భారత రిజిస్ట్రార్ జనరల్, రాష్ట్ర అలాగే పలు కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి వచ్చిన మరణాల నమోదు డేటాను ఆధారంగా తీసుకుని ఇతర డేటాతో ఆధార్ రికార్డులను సరిపోల్చిన తర్వాత యూఐడీఏఐ చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులను డీయాక్టివేషన్‌ చేసినట్లు స్పష్టం అవుతోంది.ఇక ఈ డీయాక్టివేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం 2024లోనే ప్రారంభించింది.ఈ ఏడాది జులై నాటికే దాదాపు 1 కోటీ 17 లక్షల ఆధార్ నంబర్లను యూఐడీఏఐ డీయాక్టివేట్ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి సంఖ్య కోటీ 40 లక్షలకు చేరింది. ఇక తాజాగా కేంద్రం వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2025 నవంబర్ 26 నాటికి దేశంలో 2 కోట్ల ఆధార్ నంబర్లను యూఐడీఏఐ డీయాక్టివేట్ చేసింది. డి ఆక్టివేట్ చేసిన ఆధార్ కార్డు నెంబర్లను కొత్తగా ఎవరికి కేటాయించడం జరగదని యూఐడీఏఐ అధికారులు స్పష్టం చేశారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కూడా “అన్న క్యాంటీన్లు” ఏర్పాటు

గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *