ఖమ్మం,ఐఏషియ న్యూస్: ఖమ్మం జిల్లా కారేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్న ఉషా శుభ కామేశ్వరి గురువారం 10 వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి పట్టుబడ్డారు.ల్యాండ్ మ్యుటేషన్ కోసం అవసరమైన ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ కావాలని ఆర్‌ఐను సంప్రదించారు.ఈ పని చేయడానికి పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు.దీంతో లంచం డిమాండ్ చేసిన ఆమెకు రూ.10 వేలు బాధితులు అందిస్తుండగా మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.ఆర్‌ఐపై కేసు నమోదు చేసుకుని వరంగల్ ఏసిబి జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News