
- బ్యాంకు మేనేజర్ పై తుపాకీ గురిపెట్టిన భయపడని వైనం
- బ్యాంక్ మేనేజర్ అనసూయ సమయస్ఫూర్తితో దొంగలు పరార్
అనకాపల్లి ,ఐఏషియ న్యూస్: ఏకంగా బ్యాంకులోనే చోరీ చేసేందుకు ప్రయత్నించిన ఓ దొంగల ముఠాను ఆ బ్యాంక్ మహిళ మేనేజర్ అనసూయ విజయవంతంగా అడ్డుకున్నారు. ఏకంగా ఏడుగురు దొంగలు పట్టపగలు బ్యాంకులో కస్టమర్లు ఉండగానే చొరబడి బెదిరింపులకు దిగారు. బ్యాంక్ దోపిడీ చేసేందుకు విఫలయత్నం చేశారు. ఈ క్రమంలోనే బ్యాంక్ మేనేజర్ అనసూయ పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ పెట్టి బెదిరించారు. అయితే ఆ బ్యాంక్ మేనేజర్ అనసూయ అప్రమత్తతో వ్యవహరించి సెక్యూరిటీని అలర్ట్ చేయడంతో ఆ దొంగలు పరారయ్యారు. పరారీలో ఉన్న దొంగలను పట్టుకునేందుకుపోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. వివరాల్లోకి వెళితేఅనకాపల్లి జిల్లా కేంద్రంలో రింగ్ రోడ్డు వద్ద ఉన్న కెనరా బ్యాంక్‌లో దోపిడీ చేసేందుకు గురువారం మధ్యాహ్నం ఏడుగురు దుండగులు విఫలయత్నం చేశారు. రెండు వాహనాల్లో బ్యాంకు వద్దకు చేరుకున్న ఆ దొంగల్లో ఇద్దరు బ్యాంక్ బయట కాపలాగా ఉండగా మిగిలిన వారంతా లోపలికి వెళ్లారు.ఆ బ్యాంక్ మేనేజర్ మహిళ కావడంతో ఆమెను సులువుగా బెదిరించవచ్చని భావించారు.ఈ నేపథ్యంలోనే తమ వద్ద ఉన్న తుపాకీని తీసి ఆమెకు గురి పెట్టారు. బ్యాంకులో ఉన్న డబ్బు,నగలు మొత్తం ఇవ్వాలని బెదిరింపులకు దిగారు.అయితే అంతమంది దొంగలు బ్యాంకులోకి చొరబడి తుపాకీతో బెదిరింపులు చేస్తున్నప్పటికీ ఆ మహిళా మేనేజర్ అనసూయ మాత్రం ఎక్కడా భయపడలేదు.వెంటనే తన వద్ద ఉన్న సెక్యూరిటీ అలారంను నొక్కారు.దీంతో అక్కడ వార్నింగ్ వచ్చింది అలారం గట్టిగా మోగడంతో అది గమనించిన ఆ దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.మహిళా బ్యాంక్ మేనేజర్ అనసూయ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెనుముప్పు తప్పింది.వెంటనే ఆ బ్యాంక్ మేనేజర్ అనసూయ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అదనపు ఎస్పీ మోహనరావు సిబ్బందితో సహా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బ్యాంకులో చోరీ చేసేందుకు ప్రయత్నించిన దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.నిందితులు మాట్లాడిన తీరును బట్టి వారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందినముఠాగాపోలీసులుబలంగాఅనుమానిస్తున్నారు. గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన పాత నేరస్థుల రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు.
ప్రత్యేక బృందాలు: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు సుమారు 5 నుండి 6 ప్రత్యేక పోలీసు బృందాలు నిందితులను పట్టుకోవడానికి రంగంలోకి దిగాయి. సరిహద్దు జిల్లాలను, జాతీయ రహదారులను అలర్ట్ చేశారు.
తుపాకీతో దొంగలు బెదిరించినప్పటికీ అప్రమత్తంగా ఉండి బ్యాంకు నగదు పోకుండా సమయస్ఫూర్తిగా వ్యవహరించి అలారం మోగించిన బ్యాంకు మేనేజర్ అనసూయను పలువురు ఖాతాదారులు, స్థానికులు, అభినందించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News