జయశంకర్ భూపాలపల్లి,ఐఏషియ న్యూస్: జిల్లాలోని జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలను వెంటనే అప్పగించాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.చాలా కాలంగా జర్నలిస్టు సోదరులు వేచి చూస్తున్న ఈ సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాని తీవ్రంగా టిడిపి ఖండించింది. ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర నాయకులు,వరంగల్ పార్లమెంట్ కాంటెస్ట్ ఎంపీ అభ్యర్థి సాగర్, పెద్దపల్లి టిడిపి ఇంచార్జ్ అందే భాస్కరాచారి దీక్షా శిబిరాన్ని సందర్శించి జర్నలిస్టులకు మద్దతు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ చొరవ తీసుకొని జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని జిల్లాకలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పట్టాలకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలు పత్రికల జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News