రాజ్యంగం ద్వారానే అమరావతి సాధించాం: మహిళా కమిషన్ ఛైర్మెన్ రాయపాటి శైలజ

అమరావతి,ఐఏషియ న్యూస్: భారత రాజ్యంగం ద్వారానే అమరావతి రాజధాని సాధించామని ఏపీ రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు.ఫోరమ్ ఫర్ ఆర్టిఐ ఆధ్వర్యంలో బుధవారం అమరావతి లోని మందడం రైతు జెఏసి శిభిరంలో గౌరవ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ అధ్యక్షతన రాజ్యాంగ ఆమోద దినోత్సవ రాష్ట్ర సదస్సు ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన ఛైర్మెన్ శైలజ మాట్లాడుతూ హక్కులు సాధించుకోవటానికి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చు కోవాలన్నారు. సమాచార హక్కు చట్టం ప్రజలకు వరం అని, కొంత మంది బ్లాక్ మెయిల్ చేస్తున్నా చట్టం యొక్క గొప్ప తనం అందరు గుర్తించాలన్నారు. రాష్ట్ర ఆర్టిఐ కమిషనర్ ప్రత్తిపాటి సామ్యూల్ జోనాతన్ తోలుత డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.అమరావతి రాజధాని కమిటీ అధ్యక్షులు గా కొమ్మినేని వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా రెహమాన్, యూత్ ప్రెసిడెంట్ గా పాలకాయల సైదులు, రాష్ట్ర ప్రధాన కారదర్శి గా షేక్ సర్దార్ భాష అమరావతి కమిటీ సలహా సభ్యులు గా ఆలూరి ఉమామహేశ్వరరావులు ప్రమాణ స్వీకారం చేశారు. జేఏసీ నాయకులు కట్టా రాజేంద్ర,జాతీయ అధ్యక్షులు మట్ట ప్రసాద్, బిబి నరసింహరావు, ఏసుదాసు, అమృతరాజు తదితరులు మాట్లాడారు. రాజదానిలో సదస్సు జయప్రదం పట్ల బత్తుల మురళి, సూర్యుడు దినపత్రిక ఎడిటర్ రవి కుమార్ హార్షం వ్యక్తం చేశారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కూడా “అన్న క్యాంటీన్లు” ఏర్పాటు

గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *