విశాఖపట్నం, ,ఐఏషియ న్యూస్: విశాఖపట్నం వేదికగా బుధవారం జరగనున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు స్థానిక నేతలు, అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. విమానంలో మంగళవారం రాత్రి ఆమె విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పి.వి. ఎన్. మాధవ్, విప్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు,మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహం, జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, ఇతర నేతలు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గం ద్వారా స్థానిక ర్యాడిసన్ బ్లూ రిసార్ట్ కు చేరుకున్నారు. బుధవారం జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.
Check Also
ప్రియాంకగాంధీ కుమారుడు రేహాన్ వాద్రా నిశ్చితార్థం
రాజస్థాన్ ,ఐఏషియ న్యూస్: కాంగ్రెస్ అగ్రనేత,లోక్సభ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడి వివాహం నిశ్చయమైంది. ప్రియాంక గాంధీ- రాబర్ట్ …
News Website (iasianews.net) I Asia News