టోకెన్ ఉన్న భక్తులకే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు

టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ప్రకటన

తిరుమల,ఐఏషియ న్యూస్: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఈనెల 30 నుంచి జనవరి 1 వరకు కేవలం టోకెన్ ఉన్న భక్తులకే దర్శనం కల్పించడం జరిగిందని టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు మీడియాకుతెలియజేశారు.జనవరి 2 నుంచి 8 వరకు టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శన అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.భక్తులను తిరుమలకు రావద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదని, టోకెన్ లేని వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఈ ముందస్తు సమాచారం ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.సోషల్ మీడియా పుకార్లు నమ్మవద్దని టోకెన్ లేని వారు తొలి 3 రోజులు ఇబ్బంది పడకుండా జనవరి 2 తర్వాత రావాలని చైర్మన్ బి.ఆర్ నాయుడు సూచించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *