డల్లాస్/చరోలిట్(నార్త్ కరోలినా),ఐఏషియ ప్రతినిధి: హిందువులు అధినాయకుడిగా పూజలు నిర్వహించే వినాయకుని జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని నిర్వహించే వినాయక చవితి వేడుకలు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఘనంగా సాంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకొని నిమజ్జనాన్ని కూడా ఘనంగా చేయడానికి సంసిద్ధులవుతున్నారు. ముఖ్యంగా అమెరికా డల్లాస్ ప్రిన్స్టన్ సనాతన ధర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులుగా హనుమాన్ టెంపుల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. ప్రకాష్ రావు వెలగపూడి, ప్రిస్కో ఐఎస్డి ట్రస్టీ ప్లేస్ 1 సురేష్ మండువ, రేడియో సురభి ఫౌండర్ సీఈ వో రాజేశ్వరి ఉదయగిరి పాల్గొని వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు.
చరోలిట్ (నార్త్ కరోలినా)లో కూడా వినాయకచవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తెలుగు ప్రజలంతా ఒకే చోట చేరుకొని వినాయక పూజించి సాంప్రదాయ దుస్తులు ధరించి తెలుగుదనం ఉట్టిపడేలాగా కలిసికట్టుగా వినాయకునికి పూజలు చేయడం విశేషం. విదేశాల్లో ఉద్యోగరీత్యా ఉన్నప్పటికీ తెలుగు సాంప్రదాయాలను, కట్టుబాట్లను, పూజా విధానాలను మరిచిపోకుండా మన దేవతామూర్తులను పూజిస్తూ ఆదర్శంగా నిలిచారు.
Authored by: Vaddadi udayakumar