Breaking News

రెండు గంటల సమయంలోనే తప్పిపోయిన కొడుకుని తల్లి చెంతకు చేర్చిన వన్ టౌన్ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: తప్పిపోయిన బిడ్డ ఆచూకీ రెండు గంటల్లో కనుగొన్న వన్ టౌన్ పోలీసులు. ఈ సంఘటన నగరంలోని పూర్ణ మార్కెట్ కొత్త రోడ్డు ప్రాంతంలో జరిగింది. గురువారం 3 సంవత్సరాల వయసు గల రుత్విక్ రాజును వెంట తీసుకొని కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు.
ఇంతలో కొంత సమయం అయిన తర్వాత ఆ బాలుడు తమ వెంట కనిపించకపోవడంతో రుత్విక్ తప్పి పోయాడని గ్రహించిన కుటుంబ సభ్యులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ. జీడి బాబుకు ఈ విషయం తెలుసుకొని వెంటనే హుటా హుటీన అన్ని ప్రాంతాలకు సమాచారం అందించారు. దీంతో రెండుగంటల సమయంలో తప్పిపోయిన బాలుడును తల్లి చెంతకు చేర్చారు. కుమారుడు దొరకడంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. తమ కుమారుడిని తమకు అప్పగించిన వన్ టౌన్ సిఐ.జీడి బాబుకు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు  తెలియజేశారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

𝐅𝐮𝐭𝐮𝐫𝐞 𝐨𝐟 𝐖𝐨𝐫𝐤 𝟐𝟎𝟐𝟔: 𝐒𝐤𝐢𝐥𝐥𝐬, 𝐒𝐡𝐢𝐟𝐭𝐬, 𝐚𝐧𝐝 𝐒𝐦𝐚𝐫𝐭 𝐂𝐚𝐫𝐞𝐞𝐫 𝐂𝐡𝐨𝐢𝐜𝐞𝐬!

As we enter 𝟐𝟎𝟐𝟔, the future of work is being reshaped by AI, automation, and …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *