ముంచంగిపుట్టు,ఐఏషియ న్యూస్: ముంచంగిపుట్టు మండలం లబ్బూరు జంక్షన్ వద్ద 45కిలోల గంజాయి పట్టుబడిందని ఎస్ఐ జె. రామకృష్ణ తెలిపారు. ముందస్తు సమాచారంతో సిబ్బందితో కలిసి శనివారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేశారు. రెండు బైక్ ల పై గంజాయి తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బైకులను సీజ్ చేసి ఒడిశాకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. గంజాయి విలువ సుమారు రూ.1.35లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Authored by: Vaddadi udayakumar