జనవరి 1 న్యూ ఇయర్ ఎందుకు జరుపుకుంటామంటే

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: క్షణాలు,నిమిషాలు, గంటలు,రోజులు,వారాలు,నెలలు,సంవత్సరాలు.. ఇలా కాలం గిర్రున తిరుగుతోంది. ఠక్కున క్యాలెండర్ మారిపోతోంది. మరీ క్యాలెండర్ కథేంటి? జనవరి 1వ తారీఖునే కొత్త సంవత్సరం అని సంబరాలు చేసుకుంటారు ఎందుకు? అసలు సంవత్సరాన్ని లెక్కించడానికి ప్రమాణం ఏంటి? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు మీ మదిలో మెదులుతుంటాయి కదూ.అయితే ఈ క్యాలెండర్ కహాని తెలియాలంటే కొన్ని దశాబ్దాలు కాదు కాదు శతాబ్దాలు వెనక్కి వెళ్లాల్సిందే. కాలం వేసిన బలమైన ముద్రలను లోతుగా పరిశీలించాల్సిందే. ప్రపంచానికి జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. మన తెలుగు ప్రజలు మాత్రం మార్చి/ ఏప్రిల్‌ నెలలో వచ్చే ఉగాది పండుగని నూతన సంవత్సరంగా భావిస్తారు.అయితే రోజువారీ మాత్రం ఆంగ్ల క్యాలెండర్‌నే అనుసరిస్తారు.నేపాల్‌లో అయితే దీపావళి వేడుకల్లో నాలుగో రోజైన మా పూజను నేపాలీ క్యాలెండర్‌ ప్రకారం నూతన సంవత్సరంగా జరుపుకొంటారు. ఇక చైనా, కొరియా దేశస్థులు ఫిబ్రవరి మాసంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటారు. ఇలా ఆయా దేశాలు వారి వారి దేశీయ సంప్రదాయం ప్రకారం నూతన సంవత్సరం వేడుకలు నిర్వహిస్తాయి.ఇదంతా ఓకే.ఇక్కడ ట్విస్ట్‌ఏమిటంటే అన్ని దేశాల్లో జనవరి 1వ తేదీనే నూతన సంవత్సరానికి స్వాగతంపలుకుతారు.

ఈ రోజునే నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటారు? ఎందుకలా మొదట్లో మార్చి 1న న్యూ ఇయర్
న్యూ ఇయర్ సెలబ్రేట్‌ చేసుకోవడం కొత్తేమీ కాదు. క్రీస్తుపూర్వం 4,000 సంవత్సరాల కిందటి నుంచే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించడం మొదలుపెట్టారట.వాస్తవానికి మొదట్లోప్రపంచమంతా ప్రతియేటా మార్చి నెలలో వసంత కాలం ప్రారంభమైన నాటి నుంచే నూతన సంవత్సరంగాపరిగణించేవారట. ఆ సమయంలో రోమ్‌ సామ్రాజ్యం 10 నెలలతో కూడిన రోమ్‌ క్యాలెండర్‌ను రూపొందించిందట. ఆ క్యాలెండర్‌లో తొలి నెల జనవరి కాకుండా మార్చిగా ఉండటంతో మార్చి1వ తేదీన నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడం మొదలుపెట్టారట.అలా జరుగుతున్న క్రమంలో క్రీస్తు పూర్వం 700 కాలంలో రోమ్‌ రెండో చక్రవర్తి అయిన నుమా పొంటిలియస్‌ కొత్త క్యాలెండర్‌ రూపొందించారట.ఈ క్యాలెండర్‌లో అప్పటికే ఉన్న 10 నెలలకు జనవరి, ఫిబ్రవరి నెలలను జతచేసి మొత్తం 12 నెలలు ఉన్న క్యాలెండర్‌ను రూపొందించారట.అప్పటి నుంచి మార్చి 1వ తేదీన నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించేవారు కానీ తన సామ్రాజ్యంలోని అధికారుల పదవీ కాలపరిమితిని మాత్రం జనవరి 1 నుంచి లెక్కించేవారట.అలా జరుగుతూ జరుగుతూ.. కాలక్రమంలో రోమ్‌ ప్రజలు జనవరి 1వ తేదీని నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడం ప్రారంభించారట. ఇక్కడ జనవరి అనే పేరు మాత్రం జానస్‌ అనే రోమ్‌ దేవుడి పేరు మీదుగా వచ్చినట్లు చెబుతారు. అనంతరం తర్వాత వచ్చిన పాలకులు జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం వేడుకలను తొలగించి క్రీస్తు పుట్టిన డిసెంబర్‌ 25వ తేదీ నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేలా మార్పులు చేశారట.కానీ పోప్‌ గ్రెగొరీ-13, 1582వ సంవత్సరంలో పలు మార్పులు చేర్పులతో కూడిన కొత్త గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారట. ఆయన రూపొందించిన క్యాలెండర్‌ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటంతో ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఆ క్యాలెండర్‌కి అలవాటుపడి జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడం ప్రారంభించాయట. మొదట్లో బ్రిటన్‌ గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ను అనుసరించడానికి ఇష్టపడకపోయినా కాలక్రమంలో పరిస్థితులకు అనుగుణంగా జనవరి 1వ తేదీన న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోవడం ప్రారంభించిందట. అలనాటి నుంచి నేటికీ జనవరి 1వ తేదీన న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోవడం కొనసాగుతోంది.

About admin

Check Also

Indian Diaspora Celebrates BJP’s Historic Victory in West Bengal, Assam, and Puducherry

Over 600 Indian Americans Gathered at Royal Albert Palace, Edison, NJ to Mark Defining Moment …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *