దేవాలయాల్లో ఒకే ప్రామాణికత లక్ష్యంగా నిర్వహణ
సింహాచలం ఈవో త్రినాధరావు వెల్లడి
సింహాచలం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ గొల్లపూడి విజయవాడ వారి ఆదేశాల మేరకు,రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో లడ్డు ప్రసాదాన్ని ఒకే ప్రామాణికతతో తయారు చేయడం కోసం ఆలయ కార్యనిర్వహణ అధికారి వేండ్ర త్రినాథరావు సమక్షంలో స్వామివారి ప్రసాదం తయారీ డెమో జరిగింది.
డేమోలో ఉపయోగించిన దిట్టం: సెనగపిండి: 10 కిలోలు,పంచదార: 20 కిలోలు నెయ్యి: 6 కిలోలు, జీడిపప్పు: 00:750 గ్రాములు,కిస్మిస్: 00:500 గ్రాములు,ఇలాచి పొడి: 00:75 గ్రాములు, పచ్చకర్పూరం: 00:15 గ్రాములు,జాజికాయ: 00:15 గ్రాములు వినియోగించారు.
పై తెలిపిన దిట్టం ప్రకారం లడ్డు తయారీ డెమోలో ఈఓ వేండ్ర త్రినాథరావు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు.సహాయ కార్యనిర్వహణ అధికారి వాడ్రేవు రమణమూర్తి, పర్యవేక్షణాధికారులు పాలూరి నర్సింగరావు బలువు శ్రీనివాస్ లడ్డు తయారీ డెమోలో పాల్గొన్నారు.ఈ లడ్డూలను స్వామివారి కైంకర్యంలో ఉండే వైష్ణవ స్వాములు తయారుచేశారు.ఈ సందర్భంగా ఈఓ వేండ్ర త్రినాథరావు మాట్లాడుతూ దేవాదాయ శాఖ కమిషనర్ గొల్లపూడి విజయవాడ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో లడ్డూలను ఒకే విధంగా, స్థిరమైన నాణ్యతతో తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈ డెమో నిర్వహించబడిందని పేర్కొన్నారు.Authored by: Vaddadi udayakumar