విజయవాడ,ఐఏషియ న్యూస్: కనకదుర్గ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలిగా శ్రీమతి పద్మావతి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు.ఆలయ ఈవో వి. కె. శీనా నాయక్ మహా మంటపంలో గల కార్యాలయంలో పద్మావతి చేత ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ,మాజీ శాసన సభ్యులు ఎస్. ఉదయభాను,ధర్మకర్తల మండలి సభ్యులు రాఘవ రాజు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar