హోంగార్డు కుమారుడు మెడికల్ (ఎంబిబిఎస్) సీటు సాధన

ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం,ఐఏషియ న్యూస్: మెడికల్ సీటు సాధించిన హోంగార్డు కుమారుని జిల్లా ఎస్పీకె.వి.మహేశ్వరరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.జిల్లా పోలీసు శాఖ,పాతపట్నం సర్కిల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు చక్క వాసుదేవరావు కుమారుడు శశిధర్ నాయుడు ఇటీవల నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి,ఎన్నారై ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విశాఖపట్నంలో ఎంబిబిఎస్ సీటును సాధించి తన సత్తా చాటుకున్నారు. ఈ క్రమంలో మెడికల్ సీటు పొందిన సందర్భంలో మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డిని శశిధర్ తన తల్లిదండ్రులు తో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పేద కుటుంబ నుండీ,కష్టాన్ని జయించి,దృఢ సంకల్పంతో చదువుకుని మెడికల్ సిట్ సాధించడం అభినందనీయమని,ఇది పోలీసు శాఖలో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి ప్రేరణనిచ్చే విషయమని,హోంగార్డుల కుటుంబాల సంక్షేమం కోసం జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తోంది అని ఎస్పీ పేర్కొన్నారు.ఈ సందర్భంగా హోంగార్డు కుటుంబానికి జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో వైద్య విద్యార్థిగా మెరుగైన వైద్యునిగా ప్రజలకు సేవ చేయాలని ఎస్పీ ఆకాంక్షించి,జిల్లా ఎస్పీ శశిధర్ ను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ వేంకట రమణ,కుటుంబ సబ్యులు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

అంగన్వాడి కార్యకర్తలకు ఉచిత స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: అంగన్వాడీ కార్యకర్తలకు ఉచిత మొబైల్ ఫోన్స్ (5జి టెక్నాలజీ) 12,500 ఖరీదైన మొబైల్ ఫోన్స్ ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *