కాకినాడ,ఐఏషియ న్యూస్: కాకినాడలోని జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడి నిర్వహించారు.కారుణ్య నియామకం,పెన్షన్ సెటిల్‌మెంట్ పనుల నిమిత్తం 40 వేల లంచం తీసుకుంటూ డిప్యూటీ డైరెక్టర్ ఎం లల్లి, సీనియర్ అసిస్టెంట్ కారెపు సూర్య శివప్రసాద్‌లు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. కాట్రేనికోన మండలం అడవిపేటకు చెందిన గెద్దాడ చక్రవర్తి నుంచి ఈ మొత్తం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.లంచం వ్యవహారంలో మాజీ ఉద్యోగి యాదల సత్యనారాయణను మధ్యవర్తిగా ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. బాధితుడు చక్రవర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ కిషోర్ నేతృత్వంలో అధికారులు ఉచ్చు బిగించారు.లంచం తీసుకుంటున్న సమయంలో నిందితులను పట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు,వారిని రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News