లబ్బూరు జంక్షన్ వద్ద 45 కిలోల గంజాయి స్వాధీనం

ముంచంగిపుట్టు,ఐఏషియ న్యూస్: ముంచంగిపుట్టు మండలం లబ్బూరు జంక్షన్ వద్ద 45కిలోల గంజాయి పట్టుబడిందని ఎస్ఐ జె. రామకృష్ణ తెలిపారు. ముందస్తు సమాచారంతో సిబ్బందితో కలిసి శనివారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేశారు. రెండు బైక్ ల పై గంజాయి తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బైకులను సీజ్ చేసి ఒడిశాకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. గంజాయి విలువ సుమారు రూ.1.35లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

దీపావళి పేలుడు పదార్థాల నిల్వలపై విశాఖ నగర పోలీసుల మెరుపు దాడులు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు విశాఖ నగరంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *