హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ప్రసారభారతి మాజీ సీఈవో కంభంపాటి సుబ్రహ్మణ్య శర్మ (కె ఎస్ శర్మ)(80) శనివారం హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు.ఆంధ్రప్రదేశ్ క్యాడర్1968 ఐఏఎస్ అధికారి అయిన కె ఎస్ శర్మ దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ గా కొద్ది కాలం,ఆ తర్వాత ప్రసార భారతి సీఈఓ గా 2006 వరకు సేవలు అందించారు. దూరదర్శన్ డైరెక్ట్ టు హోమ్, డిడి డైరెక్ట్ ప్లస్ లాంటి సేవలను చేపట్టటంలో శర్మ కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా కరీంనగర్ జిల్లాకలెక్టర్ గా విశేష సేవలు అందించారు. కె ఎస్ శర్మ గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేఎస్ శర్మ అంతిమ క్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ప్రసార భారతి సీఈవోగా,శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వ్యవస్థాపక సీఈఓగా అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కార్యాలయంలో ముఖ్య అధికారిగా, కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిగా,నవోదయ విద్యాలయాల స్థాపకుడిగా వీరి సేవలు మరువలేనివి. కె ఎస్ శర్మ మృతి పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Authored by: Vaddadi udayakumar