అల్లూరి జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి రూ.45.02 కోట్లు మంజూరు

మారుమూల గిరిజన స్కూళ్ల అభివృద్ధికి మంత్రి లోకేష్ చొరవ

అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్ర విద్యారంగంలో దశాబ్ధాలుగా వేళ్లూనుకున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర విద్య,ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. విద్యా శాఖను సవాల్ గా స్వీకరించిన లోకేష్ గత ఏడాదికాలంగా విప్లవాత్మక సంస్కరణలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు అనునిత్యం పడుతున్న ఇబ్బందులను వివిధ ప్రసార సాధనాల ద్వారా తెలుసుకున్న లోకేష్… వారి సమస్యల శాశ్వత పరిష్కారానికి నడుంకట్టారు. గిరిజన ప్రాంతాలలో నూరుశాతం శాశ్వత భవనాలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. మంత్రి నారా లోకేష్ చొరవతో మారుమూల ప్రాంతమైన అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 45.02కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం తాజాగా జి.ఓ నెం.264ని విడుదల చేసింది. ఇందులో ఇప్పటివరకు భవనాలు లేని, పూర్తిగా నూతన భవనాలు అవసరమైన 286 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి 85 పాఠశాలల్లో మేజర్, మైనర్ మరమ్మతుల కోసం మొత్తంగా రూ. 45.02కోట్లు కేటాయించారు. ఈ పనులను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి లోకేష్ ఆదేశాలు జారీచేశారు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మంత్రి నారా లోకేష్ స్థానిక కూటమి నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

బియ్యం షాపులో పనిచేస్తూ టీచర్ అయ్యాడు

కుటుంబం మొత్తాన్ని కరోనా పొట్టనపెట్టుకుంది 44 ఏళ్లు వచ్చినా ఎవరూ పెళ్లిచేసుకోలేదు పగబట్టిన పేదరికంతో పోరాటం చేసాడు పట్టుబట్టి చదివి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *