- అమెరికాలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం
డల్లాస్,ఐఏసియాన్ న్యూస్ ప్రతినిధి: సరదాగా హాలీడేస్ ను ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించింది. సెలవులకు వెళ్లి సజీవ దహనం అయిన షాకింగ్ ఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం ఈ ప్రమాదంలో సజీవ దహనం అయింది. ఆ షాకింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.అమెరికాలో హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనం అయింది. వెకేషన్ కోసం డల్లాస్ కు వెళ్లిన ఆ కుటుంబం కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన తేజస్విని, శ్రీ వెంకట్ దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. సెలవులు ఉండటంతో అట్లాంటలోని బంధువుల ఇంటికి కారులో వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్ ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు సజీవ దహనం అయ్యారు.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన కుటుంబం మొత్తం సజీవ దహనం అయింది. సమ్మర్ వెకేషన్ కోసం డల్లాస్ కు వెళ్లిన ఆ కుటుంబం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటనలో హైదరాబాద్ కు చెందిన తేజస్విని, శ్రీ వెంకట్ దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. అట్లాంటలోని బంధువుల ఇంటికి కారులో వెళ్లి తిరిగి డల్లాస్ కు వస్తుండగా ప్రమాదం జరిగింది. గ్రీన్ కౌంటి ఏరియాలో రాంగ్ రూట్ లో వచ్చిన ఓ మినీ ట్రక్ కారును ఢీ కొట్టింది.దీంతో కారులో మంటలు అలుముకున్నాయి. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబం మొత్తం సజీవదహనం అయింది.వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే కారు మొత్తం బూడిద కావడంతో ఎముకలను ఫోరెన్సిక్ కు పంపారు. మృతులు హైదరాబాద్ కు చెందిన శ్రీ వెంకట్, తేజస్విని దంపతులు వారి ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.