50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అమలాపురం తహసిల్దార్ అశోక్ ప్రసాద్

కార్యాలయంలో ఉన్న 5 లక్షల 88వేలు స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు

అమలాపురం,ఐఏషియ న్యూస్: డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తహసీల్దార్ కార్యాలయంపై బుధవారం ఏసిబి దాడులు నిర్వహించారు.ఏసిబి డిఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి.రాజోలు గ్రామానికి చెందిన గంధం దుర్గ కొండలరావు భూమిని సర్వే చేసేందుకు అమలాపురం తహసీల్దార్ అశోక్ ప్రసాద్ లక్ష రూపాయలు డిమాండ్ చేయగా డిజిటల్ అసిస్టెంట్ రాము ద్వారా 50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం చేసుకున్న మేరకు 50 వేలు బుధవారం లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం తీసుకున్న నగదుతో పాటు కార్యాలయంలో ఉన్న 5 లక్షల 88వేల రూపాయలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అమలాపురం తహసీల్దార్ అశోక్ ప్రసాద్, డిజిటల్ అసిస్టెంట్ రాములను ఏసీబీ అధికారు కస్టడీలోకి తీసుకున్నారు.వీరిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలిస్తామని డిఎస్పి కిషోర్ కుమార్ తెలియజేశారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *