విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: సౌత్ కొరియాలో ఈనెల 21వ తేదీ నుంచి జరుగుతున్న 20వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో విశాఖ క్రీడాకారిని శివ కోటి క్షేత్ర సిల్వర్ మెడల్ సాధించారు. ఈమె నగరానికీ చెందిన డి.దినేష్ తో కలిసి ఫెయిర్ స్కేటింగ్ పోటీల్లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించారు. ఈమె గతంలో చైనాలో జరిగిన 19వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో కూడా సిల్వర్ మెడల్ సాధించారు. ఇప్పుడు మరల తాజాగా సిల్వర్ మెడల్ సాధించిన సందర్భంగా పలువురు ఆమెను అభినందించారు. ఈమె తండ్రి డాక్టర్ ఎస్.మురళీకృష్ణ విశాఖలో ప్రముఖ హోమియో వైద్యులు. ఇప్పటివరకు ఈమె 15 జాతీయ మెడల్స్ తో సహా 49 వివిధ మెడల్స్ సాధించారు. విశాఖలోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఈమె గత కొంత కాలంగా శివాజీ పార్క్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ కోచ్ పి సత్యనారాయణ, కే.చిట్టిబాబుల పర్యవేక్షణలో స్కేటింగ్ శిక్షణ పొందుతున్నారు.
Authored by: Vaddadi udayakumar