పులివెందుల,ఐఏషియ న్యూస్: వైయస్సార్ కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు శంకర నేత్రాలయ మేసు పుట్టపర్తి కుంబు తిరుమల రెడ్డి (యూఎస్ఏ) సంయుక్త నిర్వహణలో మెగా ఉచిత క్యాటరాక్ట్ సర్జరీ క్యాంపు ప్రారంభమైంది.కంటిశుక్లం స్క్రీనింగ్ 7 రోజుల పాటు జరుగుతుంది. ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి రోగులను పరీక్షించి కంటి శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి మొబైల్ ఐ సర్జరీ బస్సులో ఈనెల 26 నుంచి 30 వరకు ఉచిత కంటిశుక్లం శస్త్రచికిత్స నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. పులివెందుల పరిసర ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో గంటి రోగులు తరలివచ్చారు.వారికి ప్రాథమికంగా వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో కంటి శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని గుర్తించి నిర్వాహకులు పేర్కొన్నారు. వైద్య శిబిరంలో పాల్గొన్న కంటి రోగులకు నిర్వాహకులు భోజన సదుపాయాన్ని కల్పించారు. ఈనెల 28 వరకు ఈ వైద్య శిబిరం నిర్వహిస్తారు.
Authored by: Vaddadi udayakumar