విజయవాడ,ఐఏషియ న్యూస్: విజయవాడ కీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి కి గురువారం రాత్రి 8. 30గంటలకు దేవస్థానంనకు దాతలు విచ్చేసి 531 గ్రాముల విశేష వజ్రాభరణాలు సమర్పించారు.సూర్యుడు, చంద్రుడు, ముక్కు పుడక, బులాకీ,బొట్టు, సూత్రాలు, గొలుసు ఈ ఆభరణాలు బంగారంతో చేయించి, వజ్రాలు పొదిగి తయారు చేశారు. దాతల నుండి ఆభరణాలును ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ,ఈవో శీనానాయక్ అందుకున్నారు.ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ సతీమణి శ్రీమతి లక్ష్మిరవి, శ్రీ గోకరాజు గంగరాజు, శ్రీ కనుమూరి బాపిరాజు,శ్రీ సూరజ్ శాంతకుమార్ డైరక్టర్, కీర్తిలాల్ కాళిదాస్ జ్యుయలరీ, తదితరులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar