అమరావతి ఎఫ్ఆర్టీఐ జనరల్ సెక్రటరీ గా పఠాన్ రెహ్మాన్ ఖాన్

తుళ్ళూరు,ఐఏషియ న్యూస్: ఫోరమ్ ఫర్ ఆర్టీఐ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కమిటీ జనరల్ సెక్రటరీ గా పఠాన్ రెహ్మాన్ ఖాన్ ను నియమిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పిట్ బాలరాజు ప్రకటించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ ఆదేశాల మేరకు కుల, మత, లింగ, పార్టీ రహితంగా ఉంటూ సమాచార హక్కు చట్టం హ్యుమన్ రైట్స్, లోకాయుక్త పై అవగాహన కల్పించడం కోసం స్వచ్ఛందంగా పని చేయాలన్నారు. సోషల్ వర్కర్ గా పని చేయాలి అనే ఇంట్రస్ట్ ఉండి స్వార్థం లేని వారికి మాత్రమే పదవులలో అవకాశం కల్పిస్తున్నాం అని ,ప్రజలకు ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకోవాలనీ సూచించారు. రాజధానిలో రైతుల పిల్లలకు, అణగారిన వర్గాలకు ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, వైద్యం అందించాలని అలాగే రైతులకు ప్లాట్లు అప్పగించాలన్న ప్రధాన డిమాండ్ లతో రాజధాని కమిటీ పనిచేస్తుందని వివరించారు. మహిళా,యూత్, స్టూడెంట్, ఎంప్లాయిస్ తదితర విభాగాలలో కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తనను ఈ పదవిలో నియమించినందుకు పఠాన్ రెహ్మాన్ ఖాన్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

Indian Diaspora Celebrates BJP’s Historic Victory in West Bengal, Assam, and Puducherry

Over 600 Indian Americans Gathered at Royal Albert Palace, Edison, NJ to Mark Defining Moment …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *