న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: రాజధాని దిల్లీ శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎంపీల నివాస సముదాయమైన బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది సుమారు గంటపాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.
మధ్యాహ్నం సుమారు 1:20 గంటల ప్రాంతంలో దిల్లీలోని బిషంబర్ దాస్ మార్గ్‌లో ఉన్న బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక విభాగానికి సమాచారం అందింది. తక్షణమే స్పందించిన అధికారులు దాదాపు 14 ఫైర్ ఇంజన్లను ఘటనా స్థలానికి పంపించారు. ఈ అపార్ట్‌మెంట్‌లోని ఒక అంతస్తులో మంటలు మొదలై వేగంగా వ్యాపించాయి. ఈ నివాస సముదాయం లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు కేటాయించిన ఫ్లాట్లతో కూడిన బహుళ అంతస్తుల భవనంనివాస సముదాయం లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు కేటాయించిన ఫ్లాట్లతో కూడిన బహుళ అంతస్తుల భవనం కావడంతో.. భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు అత్యంత వేగంగా సహాయక చర్యలను చేపట్టారు.
దాదాపు ఒక గంటకు పైగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రేమ నష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు.
Authored by: Vaddadi udayakumar