డబల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏపీలో ఎంతో అభివృద్ధి

కర్నూల్లో సూపర్ జీఎస్టీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి

ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: కర్నూలులో గురువారం నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ద్వాదశజ్యోతిర్లింగాలలో మొదటిది గుజరాత్ సోమనాధ్ ఆలయం ఉందని, తాను అక్కడే పుట్టానని మోడీ గుర్తుచేసుకున్నారు. రెండో జ్యోతిర్లింగం శ్రీశైల మల్లిఖార్జున స్వామిది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన ఆశీర్వచనాలు తీసుకున్నానని తెలిపారు. ఛత్రపతి శివాజీ ధ్యాన మందిరాన్ని కూడా దర్శించి ఆయనకు అల్లమ్మ ప్రభు, అక్కమహాదేవి లాంటి శివభక్తులకు ప్రణామాలు తెలిపినట్లు వెల్లడించారు. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి లాంటి ధీరులకు ప్రధాని వినమ్రపూర్వకనమస్కారాలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ శాస్త్ర,సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రాంతమని,యువత ఎంతోచైతన్యవంతులని ప్రధాని కితాబునిచ్చారు. ఏపీలో విజన్ ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి నేతలు ఉన్నారని మోడీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉందన్నారు. గత 16 నెలల్లో డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఏపీలో ప్రగతి వేగంగా జరుగుతోందన్నారు. ఢిల్లీ, అమరావతిలు రెండూ వేగంగా అభివృద్ది దిశగా వెళ్తున్నాయన్నారు. స్వాతంత్ర్యం సాధించి వందేళ్లు పూర్తయిన 2047 నాటికి భారత్ వికసిత్ భారత్ గా తయారవుతుందన్నారు. 21వ శతాబ్దం భారత దేశానిదని,140 కోట్ల మంది భారతీయులది అవుతుందని మోడీ తెలిపారు. విద్యుత్, రైల్వే, జాతీయ రహదారులు, రక్షణ రంగాలకు చెందిన చాలా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశామన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్రంలో కనెక్టివిటి బలోపేతం కావటంతో పాటు పరిశ్రమలను బలోపేతం చేస్తాయన్నారు. ఈ ప్రాజెక్టులతో కర్నూలుతో పాటు పరిసర ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. దేశానికైనా, రాష్ట్రానికైనా ఇంధన భద్రత అవసరమన్నారు. ప్రస్తుతం 3 వేల కోట్ల విలువైన ట్రాన్స్ మిషన్ ప్రాజెక్టులను ప్రారంభించామని, తద్వారాదేశఇంధనసామర్ధ్యంపెరుగుతుందన్నారు.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్లాక్ అవుట్ లాంటి విద్యుత్ సంక్షోభాలు వచ్చాయని, తలసరి విద్యుత్ వినియోగం 1,000 యూనిట్ల కంటే తక్కువే ఉందని, చాలా గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూడా లేని పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు క్లీన్ ఎనర్జీ నుంచి మన అవసరాలకు తగినంత ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నామన్నారు. 1,400 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగం ఇప్పుడు దేశంలో ఉందని, తగినంత విద్యుత్ దేశ ప్రజలకు లభ్యం అవుతోందని ప్రధాని తెలిపారు.శ్రీకాకుళం నుంచి ఆంగుల్ వరకూ గ్యాస్ పైప్ లైన్ ను జాతికి అంకితం చేశామని తెలిపారు. దేశ ఆర్ధిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ఓ కీలక ప్రాంతంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ది దిశగా నడుస్తోందన్నారు. 20 వేల సిలిండర్ల సామర్ధ్యంతో ఇండేన్ బాటిలింగ్ ప్లాంట్‌ను, చిత్తూరులో ప్రారంభించామన్నారు. మల్టీమోడల్ ఇన్ఫ్రా ప్రాజెక్టులతో కనెక్టివిటీ పెంచుతున్నట్లు తెలిపారు. సబ్బవరం నుంచి షీలానగర్ వరకూ కొత్త హైవేతో కనెక్టివిటీ పెరిగిందన్నారు. రైల్వే రంగంలో కొత్త యుగం ప్రారంభమైందని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందేలా ప్రాజెక్టులను ప్రారంభించుకున్నామన్నారు.
వికసిత్ భారత్ 2047 సాధన సంకల్పానికి స్వర్ణాంధ్ర లక్ష్యం మరింత బలం అందిస్తుందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ వేగాన్ని మరింతగా పెంచుతుందన్నారు. భారత్ దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రగతి వేగాన్ని ప్రపంచం గమనిస్తోందన్నారు. గూగుల్ లాంటి ఐటీ దిగ్గజం ఏపీలో అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించిందన్నారు. దేశపు తొలి అతిపెద్ద ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. అమెరికా వెలుపల భారీ పెట్టుబడితో ఏపీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హబ్ పెడుతున్నట్టు గూగుల్ సీఈఓ చెప్పారన్నారు. డేటా సెంటర్,ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ లాంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఈ కేంద్రంలో ఏర్పాటు కాబోతున్నాయన్నారు. కర్నూలులో భారత్ డ్రోన్‌ హబ్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ నిర్ణయించటం సంతోషదాయకమన్నారు.ఆపరేషన్ సింధూర్ లో డ్రోన్ల పనితీరు ఏమిటో తెలియచెప్పిందన్నారు. నవరాత్రి ముందు జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి తీసుకువచ్చామని, ప్రజలపై పన్నుల భారం తొలగించామని తెలిపారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట కార్యక్రమాలు చేపట్టటం అభినందనీయమన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల ఏపీ ప్రజలు రూ.8 వేల కోట్ల మేర ప్రజలకు ఆదా అవటం సంతోషదాయకమన్నారు. కానీ ఆ ప్రయోజనాలు అందరికీ అందాల్సి ఉంది… అప్పుడే అది సఫలమైనట్టన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్,ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, వైద్యాలయం శాఖ మంత్రి కుమార్ యాదవ్, తో పాటు పలువురు మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ ఘనంగా సత్కరించి మహాదేవుని జ్ఞాపికను అందజేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ఈ యాప్ ఉంటే చాలు.. కల్తీ మద్యం కనిపెట్టొచ్చు..ఏపీ ప్రభుత్వం ఆలోచన

అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక యాప్ తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *