Entertainment

26 నుంచి “భారత్ గౌరవ్” ప్రత్యేక పర్యాటక రైలు ప్రారంభం

ప్రత్యేక ప్రతినిధి,ఐఏషియ న్యూస్: జీవితంలో కనీసం ఒక్కసారైనా చూడాల్సిన చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను ఒకేసారి చుట్టి రావాలి అనుకునే వారికి ఐఆర్‌సీటీసీ ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. అదే ‘భారత్ గౌరవ్’ ప్రత్యేక పర్యాటక రైలులో ‘భవ్య గుజరాత్’ యాత్ర. మీరు గుజరాత్ వైభవాన్ని, శక్తిపీఠాలను, ఆధునిక అద్భుతాలను చూడాలని కలలు కంటున్నారా? అయితే ఈ పది రోజుల (9 రాత్రులు/10 రోజులు) ప్యాకేజీ మీకోసమే. ఎప్పుడు మొదలవుతుంది? ఈ ప్రత్యేక రైలు ఈనెల 26న మధ్యాహ్నం 03:00 గంటలకు రేణిగుంట రైల్వే స్టేషన్ …

Read More »

అమెరికాలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె ప్రేమ వివాహం

వివాహానికి హాజరైన అంబటి రాంబాబు దంపతులు ఇల్లినాయిస్‌(యుఎస్),ఐఏషియ న్యూస్:  మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె శ్రీజ ప్రేమ పెళ్లి చేసుకున్నారు.అమెరికాలో అంబటి రాంబాబు దంపతులు, బంధువులు వరుడి తరఫు బంధువుల సమక్షంలో ఇల్లినాయిస్‌లోని మహాలక్ష్మీ ఆలయంలో హిందూ సాంప్రదాయ పద్దతుల్లో వివాహ వేడుక చేశారు. డాక్టర్ శ్రీజ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో ఎండోక్రైనాలజీ విభాగంలో ఫెలోషిప్ చేస్తున్నారు. వరుడు జాస్తి హర్ష అమెరికాలో డోయిచ్ బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అంబటి అల్లుడు హర్దదిపశ్చిమగోదావరి జిల్లా తణుకు కాగా ఆయనది కమ్మ …

Read More »

బాలకృష్ణ చిరంజీవి వివాద పరిష్కారానికి ఆచితూచి అడుగులు

రేపు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో చిరంజీవి అభిమానుల సమావేశం ఏపీ స్టేట్ బ్యూరో ,ఐఏషియ న్యూస్:  మెగా బ్రదర్స్ ఎందుకు మౌనంగా ఉన్నారు. బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి ఎపిసోడ్ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు. చిరంజీవి స్పందనతో ఇప్పుడు ఈ వ్యవహారం సినీ-పొలిటికల్ వివాదంగా మారుతోంది. వైసీపీ నేతలు ఈ ఎపిసోడ్ ను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వివాదంలో ఇప్పటి వరకు మెగా బ్రదర్స్ డిప్యూటీ సీఎం పవన్. ఎమ్మెల్సీ నాగబాబు స్పందించలేదు. …

Read More »

విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

అమరావతి చాన్విక జ్యోతిన్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు భారీ ఊరట ఇచ్చింది. దుర్గగుడి ఆలయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహణపై విపక్ష వైసీపీ నేతలు, కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను తోసిపుచ్చి.. “విజయవాడ ఉత్సవ్‌”ను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కాగా మొదట హైకోర్టు సింగిల్ బెంచ్, ఆలయ భూముల్లో వ్యాపార సంబంధిత కార్యక్రమాలు జరగకూడదని ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని …

Read More »

ప్రసారభారతి మాజీ సీఈవో కె.ఎస్.శర్మ అనారోగ్యంతో మృతి

హైదరాబాద్,ఐఏషియ న్యూస్:  ప్రసారభారతి మాజీ సీఈవో కంభంపాటి సుబ్రహ్మణ్య శర్మ (కె ఎస్ శర్మ)(80) శనివారం హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు.ఆంధ్రప్రదేశ్ క్యాడర్1968 ఐఏఎస్ అధికారి అయిన కె ఎస్ శర్మ దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ గా కొద్ది కాలం,ఆ తర్వాత ప్రసార భారతి సీఈఓ గా 2006 వరకు సేవలు అందించారు. దూరదర్శన్ డైరెక్ట్ టు హోమ్, డిడి డైరెక్ట్ ప్లస్ లాంటి సేవలను చేపట్టటంలో శర్మ కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా కరీంనగర్ జిల్లాకలెక్టర్ గా విశేష సేవలు అందించారు. …

Read More »

969 కిలోల బరువున్న భారీ గుమ్మడికాయను పండించి రికార్డ్ సృష్టించిన రష్యా రైతు

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: రష్యా రైతు అలెగ్జాండర్ చుసోవ్ అరుదైన ఘనత సాధించారు. ఏకంగా 969 కిలోల బరువున్న భారీ గుమ్మడికాయను పండించి కొత్త రికార్డు సృష్టించారు. ఈ గుమ్మడికాయను మాస్కోలో జరిగిన అతిపెద్ద కూరగాయల పోటీలో ప్రదర్శించారు. రష్యా చరిత్రలో ఇంత పెద్ద గుమ్మడికాయ మొదటిసారి నమోదు కావడం విశేషం. ఆరు నెలల శ్రమ ఫలితం ఈ భారీ గుమ్మడికాయను పెంచడానికి చుసోవ్ దాదాపు ఆరు నెలలకు పైగా కృషి చేసినట్టు తెలిపారు. గుమ్మడికాయ పెరుగుదలకు అనువైన వాతావరణం కోసం ప్రత్యేకంగా గ్రీన్‌హౌస్ …

Read More »

కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి త్వరలో ప్రారంభోత్సవం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా పలు పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని వియ్యం ఆర్డీఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ తెలిపారు. అందులో భాగంగా కైలాసగిరి మీద ఇటీవల సుమారు 5.50 కోట్ల రూపాయల ఖర్చుతో త్రిశూలం ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయడం జరిగిందని, అదేవిధంగా సుమారు 7 కోట్ల రూపాయల నిధుల బడ్జెట్ తో విశాఖకే కాకుండా యావత్తు ఆంధ్రప్రదేశ్ …

Read More »

మోడీ తర్వాత స్థానం జూనియర్ ఎన్టీఆర్‌ దే

పాపులర్ వ్యక్తుల జాబితా విడుదల చేసిన ఎక్స్ సంస్థ బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్‌లు, చర్చలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఎక్స్ (ట్విట్టర్)లో సినీ,రాజకీయ, క్రీడా ప్రముఖుల గురించి నెటిజన్లు నిరంతరం మాట్లాడుకుంటుంటారు.తాజాగా, ఆగస్టు నెలలో ఇండియాలో అత్యధికంగా చర్చ జరిగిన సెలబ్రిటీల జాబితాను ఎక్స్ సంస్థ విడుదల చేయగా,అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండవ స్థానం దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ జాబితాలో ఎప్పటిలాగే ప్రధాని నరేంద్ర మోడీ అగ్ర స్థానంలో నిలిచారు.అయితే, ఆయన తర్వాత ఎన్టీఆర్ నిలవడం …

Read More »

విశాఖ బీచ్ లో హాప్ ఆన్ హాప్ అఫ్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విశాఖపట్నం,,ఐఏషియ న్యూస్: విశాఖలో పర్యాటకానికి మరింత ఆకర్షణ జోడిస్తూ డబుల్ డెక్కర్ బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విశాఖ బీచ్ రోడ్డులో హాప్ ఆన్ – హాప్ అఫ్ డబుల్ డెక్కర్ పర్యాటక బస్సులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో తిరగనున్న ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్లో స్వయంగా ప్రజా ప్రతినిధులతో కలిసిసీఎంకొంతదూరంప్రయాణించారు. బస్సు నుంచే బీచ్ లో ఉన్న పర్యాటకులకు అభివాదం చేశారు. …

Read More »

వియత్నాం అందాల పోటీల్లో సూపర్ గ్లోబల్ ఫస్ట్ రన్నరప్ గా బొడ్డేటి డింపుల్ హిరణ్య

విశాఖపట్నం,ఐఏషియ జ్యోతిబ్యూరో: వియత్నాం దేశంలో నిర్వహించిన అందాల పోటీల్లో విశాఖ గోపాలపట్నానికి చెందిన బొడ్డేటి డింపుల్ హిరణ్య సూపర్ గ్లోబల్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచి విశాఖ ఖ్యాతి పెంచింది.గురువారం విశాఖ చేరుకున్న సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్ట్ లో హిరణ్య బంధువులు, స్నేహితులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. విశాఖ టింపనీ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న హిరణ్యకు తల్లి ప్రవళిక అండదండలు అందిస్తూ తనదైన శైలిలో ఆమెను ప్రోత్సహిస్తుండటం ఆమెకు కలిసి వచ్చింది. హిరణ్య తాతయ్య పిల్ల రాజబాబు అమ్మమ్మ లావణ్య మనవరాలు …

Read More »